: అప్పుడే అయిపోలేదు... కథ ఇంకా ఉంది, చూపిస్తాను: కేసీఆర్
గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు చెప్పే తీర్మానంపై కేసీఆర్ ప్రసంగిస్తుండగా విపక్షాలు పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ఆయన ప్రసంగాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోబోగా, కేసీఆర్ స్పందించారు. "ఒక్క నిమిషమండీ... వినాలి కదా. అంత ఎందుకు మీరు... ఎందుకంత బెదిరి అదిరిపడుతున్నరండీ? ఇంకా చానున్నది స్టోరీ. అప్పుడే అయిపోయినాదా? చాలున్నది చరిత్ర. చూపిస్తా... ఒక్క పథకానికే ఇలా అయిపోతే ఎట్లా?" అన్నారు. శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని తెలంగాణకు దగ్గర చేసేందుకే ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును చేపట్టామని వివరించారు.