: శ్రీకాంత్ ను చితకబాదిన గాయని మధుప్రియ బంధువులు... తీవ్రగాయాలతో యశోదా ఆసుపత్రికి!


తన భార్యను తనతో పంపించాలని డిమాండ్ చేస్తూ, గాయని మధుప్రియ ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ను ఆమె బంధువులు చితకబాదారు. 'మా బిడ్డను తీసుకెళ్లి ఇబ్బందులు పెడతావా?' అంటూ శ్రీకాంత్ పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆపై పోలీసులు కల్పించుకుని శ్రీకాంత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాంత్ కు యశోదా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కాగా, నిన్న గాయని మధుప్రియ తన భర్తపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News