: కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు.. నితీశ్‌పై ప్రశంసలు
స్వతంత్ర భారతావని అవతరించినప్పటి నుంచి బీహార్ అభివృద్ధిపై నాటి అధికార కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదని పధాని నరేంద్రమోదీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పరాజయం తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు వెళ్లారు. మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్యంతో బీహార్ ప్రభుత్వం నాడు శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టులను గుర్తుచేశారు. బీహార్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ను మోదీ ప్రశంసించారు. నితీశ్‌తో కలిసి మోదీ బీహార్ పర్యటన ఆసక్తికరంగా సాగింది. ఒకే హెలికాప్టర్‌లో హాజీపూర్‌కు వెళ్లారు. బీహార్ పర్యటనకు వచ్చిన మోదీని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. పాట్నా హైకోర్టులో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలలో మోదీ, నితీశ్ కలసి పాల్గొన్నారు.