: మే 1న తెలంగాణ టెట్... రేపు నోటిఫికేషన్!
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను మే 1న నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. టెట్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 16 నుంచి 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 20న హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే1న టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, ఏప్రిల్ 9న టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ప్రకటించినప్పటికీ పరీక్ష వాయిదా పడింది.