: ‘ఇంద్ర’లో మాదిరిగా భూమిని ముద్దుపెట్టుకోవాలనిపించింది: హీరో సందీప్ కిషన్


‘లవ్ యూ మై హైదరాబాద్.. మిస్డ్ యూ’ అంటూ యువహీరో సందీప్ కిషన్ ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఎందుకు చేశాడంటే... ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం సుమారు నెల రోజుల పాటు విదేశాల్లో పర్యటించాడు. ఈరోజే హైదరాబాద్ కు చేరుకున్నాడు. మన భూమిపై కాలు మోపే సరికి సందీప్ కిషన్ ఆనందానికి అంతులేదట. అందుకే ఈ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘ఇంద్ర’ గురించి కూడా ప్రస్తావించాడు. ఈ చిత్రంలో చిరంజీవి భూమిని ముద్దుపెట్టుకునే ఒక సన్నివేశం ఉంటుంది. విదేశీయానం ముగించుకుని వచ్చిన తనకు కూడా ఆ చిత్రంలో చిరంజీవి మాదిరి భూమిని ముద్దుపెట్టుకోవాలనిపించిందని ఆ ట్వీట్ ద్వారా తన మనసులో మాట బయటపెట్టాడు. కాగా, ఈ నెల చివరి వారంలో సందీప్ నటించిన చిత్రం ‘రన్’ విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియోను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News