: మోదీజీ... భారత్ కు ప్రధానిగా ఉండండి, ఆరెస్సెస్ ప్రచారకర్తగా కాదు: ఆర్జేడీ ఘాటు వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ పర్యటనకు వెళుతున్నారు. గతేడాది జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వెళ్లిన మోదీ, ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత ఆయన ఆ రాష్ట్రం వైపు దృష్టి సారించిన దాఖలా కూడా లేదు. ఇక ఎన్నికల సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన 1.25 లక్షల కోట్లు కూడా విడుదల కాలేదట. ఈ నేపథ్యంలో నేడు బీహార్ కు వస్తున్న మోదీపై ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ ఆర్జేడీ ఘాటు వ్యాఖ్యలు సంధించింది. ‘‘మోదీజీ.. మీరు భారత్ కు ప్రధానమంత్రి. ఆరెస్సెస్ కు ప్రచారకర్త కాదు. ప్రధానిగా బీహార్ ను కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా పరిగణించండి’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. ఇక ఆర్జేడీ యువనేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ ప్రసాద్ యాదవ్... ఎన్నికల సందర్భంగా మోదీ ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీని ప్రస్తావించారు. బీహార్ కు నాడు ఎంత గొప్పగా ప్యాకేజీ ప్రకటించారో, అదే స్థాయిలో ప్రస్తుతం దానిని నెరవేర్చలేకపోయామని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.