: నా తృప్తి కోసమే ఇటువంటి సినిమాలు తీస్తున్నాను: సినీ నటుడు నారాయణమూర్తి


తన సంతృప్తి కోసమే 'దండకారణ్యం' వంటి సినిమాలను తీస్తున్నానని విప్లవ కథా చిత్రాల నాయకుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో దండకారణ్యం వంటి సినిమాలను ప్రజలు ఆదరిస్తారా? అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రజలను తానేమీ మేల్కొల్పడం కానీ, చైతన్యపరచటం కానీ చేయడం లేదని అన్నారు. ప్రజలే తమను చైతన్యపరుస్తారని అన్నారు. భారత దేశ రాజ్యాంగం ఇక్కడి ఆదివాసీలకు అద్భుతమైన రక్షణ కవచాన్ని ఇచ్చింది. కానీ, అభివృద్ధి పేరు చెప్పి వారి ఉనికికే ప్రమాదం తెస్తున్నారని అన్నారు. బొబ్బిలి, సాలూరు, పాల్వంచ, కరీంనగర్ జిల్లా, ఛత్తీస్ గఢ్ మొదలైన ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సినిమాలో గద్దర్ పాటలు పాడటానికి కారణం తనపై ప్రేమ కాదని... ఉద్యమంపై ఆయనకున్న కమిట్ మెంట్ అని నారాయణమూర్తి అన్నారు.

  • Loading...

More Telugu News