: ముగిసిన పోలీసు కస్టడీ... నాంపల్లి కోర్టుకు రావెల సుశీల్


మద్యం మత్తులో మహిళ చేయి పట్టి కారులోకి లాగేందుకు యత్నించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్, అతడి కారు డ్రైవర్ రమేశ్ ల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో కొద్దిసేపటి క్రితం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 3న చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కేసులో నిందితులను విచారించాల్సి ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు సుశీల్, రమేశ్ లను రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ కస్టడీ నిన్న రాత్రికే ముగిసింది. దీంతో నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు మరికాసేపట్లో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News