: నాలుగేళ్లయినా మాతృత్వానికి దూరం కావాలి... మహిళా యుద్ధ పైలెట్లకు ఐఏఎఫ్ సలహాపై విమర్శలు


సమానత్వం, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ, యుద్ధ విమానాల్లో మహిళా పైలెట్లను అనుమతించనున్నామని గర్వంగా వెల్లడించిన ఐఏఎఫ్ అంతలోనే విమర్శల పాలైంది. భావనా కాంత్, మోహనా, అవని చతుర్వేదిలు ప్రస్తుతం యుద్ధ విమాన పైలెట్లుగా తుది దశ శిక్షణలో ఉండగా, జూన్ 18 నుంచి పూర్తి స్థాయి విధులను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరికి కనీసం నాలుగేళ్ల పాటు గర్భం దాల్చవద్దని ఎయిర్ చీఫ్ మార్షన్ ఎన్ కే టాండన్ సూచించారని వార్తలు రావడంతో, ఇదేనా సమానత్వం? అంటూ మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. దీంతో టాండన్ వివరణ ఇస్తూ, గర్భం దాల్చవద్దన్న నిబంధన లేదని, అయితే, వారికి సలహా మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. వారి ఆరోగ్యం కోసమే ఈ సలహా ఇచ్చినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News