: తిరుమల వెంకన్నకు రూ.కోటి విరాళమిచ్చిన విశాఖ భక్తుడు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో విరాళాలు అందుతున్న ఆలయాల్లో తిరుమల కూడా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. నిత్యం వేలాది మంది భక్తులు తమ ఇష్టదైవమైన వెంకన్నకు కోట్లాది రూపాయల కానుకలను సమర్పిస్తున్నారు. ఏ రోజు చూసినా వెంకన్న హుండీ ఆదాయం కోటి రూపాయలకు ఏమాత్రం తగ్గదు. తాజాగా వెంకన్న సన్నిధికి మరో భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. విశాఖకు చెందిన తేళ్ల శ్రీనివాసరావు అనే భక్తుడు వెంకన్న ఆలయ పరిధిలోని శ్రీవారి అన్నదానం ట్రస్టుకు కొద్దిసేపటి క్రితం ఈ భూరి విరాళాన్ని అందజేశారు.