: ఫస్ట్ క్లాస్ లో సీటు... వెంట 7 భారీ బ్యాగులు, ఓ లేడీ: దర్జాగా పారిపోయిన మాల్యా


దేశంలోని 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి లండన్ కు జారుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... దేశం విడిచి వెళ్లిపోయే క్రమంలో దర్జాగానే వెళ్లిపోయారట. ఫస్ట్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకున్న ఆయన వెంట ఓ మహిళను కూడా తీసుకెళ్లారట. ఢిల్లీలో లండన్ వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని ఎక్కిన మాల్యా తన వెంట ఏడు భారీ బ్యాగులను కూడా తీసుకెళ్లారు. ఆ బ్యాగుల్లో ఏముందో తెలియదు కాని, మాల్యా మాత్రం వాటిని భద్రంగా తీసుకెళ్లినట్లు ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికర కథనం రాసింది. నిత్యం మద్యం, మగువతో ఎంజాయ్ చేసే మాల్యా... దేశాన్ని వీడి వెళుతున్న సందర్భంగా తన పంథా మార్చలేదంటూ ఆ పత్రిక రాసింది. అయితే ఆయన వెంట వెళ్లిన మహిళ ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ నెల 2 మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లైట్ ఎక్కిన మాల్యా దర్జాగానే లండన్ చేరిపోయాడు. మాల్యా డిల్లీలో లండన్ ఫ్లైట్ ఎక్కే సమయానికి ఆయన విదేశీ ప్రయాణంపై నిషేధం ఏమీ లేదు. ఈ కారణంగానే మాల్యా ఎలాంటి ఇబ్బంది లేకుండానే దేశం వదిలి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News