: ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు-2
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకువచ్చారు. 2016-17 ఏపీ బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు... * ఏపీలో వ్యాపారం మరింత సులభం. * అన్ని రంగాల అభివృద్ధికీ పెద్దపీట. * తిరుపతిలో సైబర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇజ్రాయిల్ సహకారంతో ఏర్పాటు. * ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు తొలి పాలసీని ప్రకటించనున్న ఏపీ. * రాష్ట్రంలో సహజవనరులు పుష్కలం. * సుదీర్ఘమైన సముద్రతీరం ఏపీకి అదృష్టదాయని. * ఎకానమీ పెరిగేలా నూతన ఉద్యోగ సృష్టి. * విజయవాడలో కోస్టల్ మ్యూజియం ఏర్పాటు. * తిరుపతి, విశాఖ, విజయవాడల్లో 3 కన్వెన్షన్ సెంటర్లు. * పీపీపీ విధానంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం. * 2015లో పెరిగిన పర్యాటకుల సంఖ్య * 2014తో పోలిస్తే 30 శాతం పెరిగి 12.18 కోట్లకు చేరిన పర్యాటకులు * ఈ ఏడు 40 శాతం పెరుగుతారని అంచనా. * కోస్తా ప్రాంతంలో ఎకనామిక్ జోన్లు. * కేంద్ర సాయంతో మరిన్ని ఎస్ఈజడ్ లు. * విశాఖ - చెన్నై, కర్నూలు - బెంగళూరుల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి. * ఈ నగరాల మధ్య రైలు రవాణాకు పెద్దపీట. * దొనకొండలో 5,717 ఎకరాల్లో పారిశ్రామిక వాడ. * అంచనా వ్యయం రూ. 23,000 కోట్లు. * 1.33 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం. * పలు ప్రాజెక్టులకు ఏడీబీ, జపాన్ బ్యాంకుల సాయం. * 2016-17లో మరిన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. * ప్రకాశం జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేన్యుఫాక్చరింగ్ జోన్. * 14,231 ఎకరాల్లో జోన్. * రూ. 43,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. * వచ్చే పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు. * చిత్తూరు జిల్లాలో సైతం 5 వేల హెక్టార్లలో ఇదే తరహా జోన్. * రూ. 30 వేల కోట్ల పెట్టుబడి, 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. * రాష్ట్రంలోని నౌకాశ్రయాల కెపాసిటీ పెంపునకు చర్యలు. * మచిలీపట్నం, భావనపాడు పోర్టుల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి. * కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం ప్రాంతాల్లో కొత్తగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పోర్టులు. * సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా వీటి అభివృద్ధి. * 2015తో పోలిస్తే, 59 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్. * అతి త్వరలోనే విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల విస్తరణ. * భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జున సాగర్, దొనకొండల్లో చిన్న విమానాశ్రయాలు. * రాష్ట్రవ్యాప్తంగా రోడ్ గ్రిడ్. * అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రహదార్లు. * అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు. * అన్ని జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు లేదా ఆరు వరుసల రహదార్లు. * పర్యాటక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ హబ్ ల నుంచి సమీప జాతీయ రహదారికి రెండు లేదా నాలుగు లైన్ల రోడ్లు. * అనంతపురం - కర్నూలు - అమరావతికి రహదారికి ఇప్పటికే జాతీయ హోదా. * దీంతో రాయలసీమకు రాజధానితో మెరుగైన కనెక్టివిటీ. * 2015-16లో 2704 కి.మీ రహదారుల నిర్మాణం. * ప్రధాన మంత్రి గ్రామ స్వరాజ్ యోజనలో భాగంగా మరిన్ని నూతన రహదారులు. * గోదావరి పుష్కరాల మాదిరిగానే కృష్ణా పుష్కరాలు. * నది పొడవునా ఘాట్లు. పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు. * పనులన్నీ జులై నెలాఖరులోగా పూర్తి. * ఇప్పటికే రాష్ట్రంలో 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ. * 93.5 లక్షల ఇళ్లకు లబ్ధి. * మార్చి 2016 నాటికి అన్ని ఇళ్లలోనూ ఎల్ఈడీ బల్బులుంటాయి. * 3 లక్షల వీధి దీపాలను ఎల్ఈడీలతో మార్చాం. * కాకినాడ - విశాఖ మధ్య గ్యాస్ పైప్ లైన్ జూన్ 2017లోగా పూర్తి. * రాష్ట్రమంతటికీ గ్యాస్ గ్రిడ్ విస్తరణకు చర్యలు. * ఈ ఏడాది లోగా అన్ని ఇళ్లలో గ్యాస్ స్టౌలే ఉంటాయి. * ఈ-ఔషధి, తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్ తదితరాలతో పేదలకు మేలు. * నిర్మాణంలోని మంగళగిరి ఎయిమ్స్ కు మరిన్ని నిధులు. * ప్రజలందరికీ పోషకాహారం ప్రభుత్వ లక్ష్యం. * పోషకాహార లోపాలను తొలగించేందుకు మరిన్ని చర్యలు. * అన్న అమృత హస్తంతో గర్భిణీలకు ఉచిత పోషకాహారం. * అన్న అమృత హస్తానికి ఈ ఏడు 45 శాతం అధిక నిధులు. * మధ్యాహ్న భోజన పథకానికి 67 శాతం అదనపు నిధులు. * 4.01 కోట్ల మందికి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ. * ప్రజల కొనుగోలు శక్తికి ఇబ్బందుల్లేకుండా ధరలు. * నెలకు 50 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే ఎస్సీల ఇళ్లకు మరిన్ని రాయితీలు. * గత సంవత్సరంతో పోలిస్తే ఎస్టీలకు అదనంగా 75 శాతం నిధులు. * బీసీలకు 31.5 శాతం అధిక నిధులు. * 50 వేల బ్రాహ్మణ కుటుంబాలను దారిద్ర్య రేఖ ఎగువకు తెస్తాం. * ఎన్టీఆర్ భరోసా పథకంతో పలు విభాగాల ప్రజలకు సాంఘిక భద్రత. * 8.7 లక్షల స్వయం సహాయక బృందాల్లో 80 లక్షల మంది సభ్యులు. * మహిళా సాధికారత సాధనకు మరిన్ని పథకాలు. * స్వయం సహాయక బృంద సభ్యులకు డిజిటల్ విద్య. * ప్రపంచ బ్యాంకు సాయంతో 150 వెనుకబడిన మండలాల్లో డిజిటల్ పాఠశాలలు. * వీటిల్లో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులకూ చోటు. * యువతలో ఔత్సాహికత పెంపునకు ప్రత్యేక చర్యలు. * నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా శిక్షణా కేంద్రాల ఏర్పాటు. * 2019 నాటికి 2 కోట్ల మందికి శిక్షణ లక్ష్యం. * రాష్ట్ర స్థాయిలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టిన తొలి రాష్ట్రం. * పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు. * ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకూ పరీక్షా కాలమిది. * ధైర్యంగా ముందడుగుతో సాగాల్సిన సమయం. * ప్రజల అండదండలుంటేనే అభివృద్ధి. * ఇండియాలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యం.