: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మన్ కోహ్లీనే!: పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్


పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ దృష్టిలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరో తెలుసా? ఇంకెవరూ టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే. టెస్టు అయినా, వన్డే అయినా, చివరకు టీ20 అయినా... మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న విరాట్ కోహ్లీపై వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ ఎవరని తననడిగితే... విరాట్ కోహ్లీనే అని టక్కున చెప్పేస్తానని అక్రమ్ పేర్కొన్నాడు. ‘స్పోర్ట్స్ టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ప్రతిభాపాటవాలను ఆకాశానికెత్తేసిన అక్రమ్... కోహ్లీకి బౌలింగ్ వేయాలంటే చాలా కష్టమైన పనేనంటూ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News