: కేన్స్ జ్యూరీలో సభ్యత్వం నాకు గౌరవం: విద్యా బాలన్


ఫ్రాన్స్ లోని కేన్స్ పట్టణంలో జరగనున్న 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2013' జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడంపై నటి విద్యా బాలన్ సంతోషం వ్యక్తం చేసింది. కేన్స్ జ్యూరీలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని తెలిపింది. ఇందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ముంబయిలో నిన్న ఓ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్ లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు తనను జ్యూరీ ఆహ్వానించడంపై మాట్లాడింది. ఈ సంవత్సరం భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో ఈ గౌరవం దక్కడం మరింత గుర్తిండిపోతుందని పేర్కొంది. మే 5 నుంచి 66వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News