: కుంభవృష్టి, వరదలతో అతలాకుతలమైన ఎడారి దేశం యూఏఈ


ఏడాదిలో ఒక్క రోజు వర్షానికి కూడా దాదాపు నోచుకోని ఎడారి దేశాలు ఇప్పుడు కుంభవృష్టితో అతలాకుతలమౌతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వచ్చి ప్రజల జీవనం స్తంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలను నిలిపివేశారు. మరింత వర్షం పడొచ్చన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అబూదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడి అల్ బతీన్ ఎయిర్ పోర్టులో జరుగుతున్న అబూదాబీ ఎయిర్ ఎక్స్ పో ప్రదర్శన నిలిచిపోయింది. వందలాది వాహనాలు నీట మునిగాయని, పలు భవంతుల సెల్లార్ లలో నీరు నిలిచిందని, రహదారులపై 250కి పైగా వాహన ప్రమాదాలను పోలీసులు రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలను చూస్తుంటే, అసలు ఎడారి దేశంలో ఈ తరహా కుంభవృష్టి ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి యూఏఈ తదితర అరబ్ దేశాల్లో సాలీనా సగటున 7.8 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. బ్రిటన్ లో పడే వర్షంతో పోలిస్తే ఇది 15 రెట్లు తక్కువ.

  • Loading...

More Telugu News