: వీరే ఉగ్రవాదులు... 51 దేశాలకు చెందిన 22 వేల మంది పేర్లు, వివరాలు వెల్లడించిన స్కైన్యూస్!
ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదుల జాబితాను బ్రిటన్ కు చెందిన స్కై న్యూస్ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ సహా యూరప్, ఉత్తరాఫ్రికా, కెనడా తదితర దేశాల పౌరులై, ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై ఐఎస్ఐఎస్ లో చేరిన వారి పేర్లు, టెలిఫోన్ నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలను విడుదల చేసింది. ఈ ఫోన్లలో కొన్ని ఇంకా పని చేస్తున్నాయని తెలిపింది. మొత్తం 51 దేశాలకు చెందిన 22 వేల మంది వివరాలను స్కై న్యూస్ బహిర్గతం చేసింది. ఇప్పటివరకూ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తరువాత మాత్రమే, వారి గురించిన పూర్తి వివరాలు తెలుస్తుండగా, ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదుల పూర్తి సమాచారం ఒకేసారి వెల్లడి కావడం ఇదే మొదటిసారి.