: టీడీపీ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి... అందుకే అవిశ్వాసమన్న సుజయకృష్ణ


ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని, ఈ కారణంగానే తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నామని విపక్ష వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కార్యదర్శికి 15 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. ఈ తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ ఈ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని సుజయకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి తాము వ్యతిరేకం కాదన్న ఆయన ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే నూతన రాజధాని అమరావతిలో అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న భూదందాకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News