: మమతా బెనర్జీపై నేతాజీ బంధువు పోటీ!
రానున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ప్రత్యర్థిగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ బంధువు చంద్రకుమార్ బోస్ పోటీ చేయనున్నారు. బీజేపీ తరపున చంద్రకుమార్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ బోస్ మాట్లాడుతూ.. బీజేపీ ద్వారా బెంగాల్లో మార్పు తెచ్చే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకు ఏడు విడతల్లో ఎన్నికలకు కమిషన్ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.