: శామ్‌సంగ్‌ నుంచి జే సిరీస్‌లో మ‌రో స్మార్ట్ ఫోన్


సామ్‌సంగ్ 'జే సిరీస్‌'లో త్వ‌ర‌లో మ‌రో స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేయ‌నుంది. గెలాక్సీ జే1 పేరుతో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను ఇప్పటికే సంస్థ తన ఫిలిప్పీన్స్‌ వెబ్‌సైట్లో పొందుపరిచింది. అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో వెల్లడించలేదు. 4 అంగుళాల ట‌చ్ స్క్రీన్‌తో 1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది విడుదల కానుంది. దీని ధ‌ర గురించి మాత్రం సంస్థ ఏ వివ‌రాలు చెప్పలేదు. అయితే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. గెలాక్సీ జే1.. 8జీబీ అంతర్గత మెమొరీ, 768ఎంబీ ర్యామ్ తో మార్కెట్లోకి రానుంది.

  • Loading...

More Telugu News