: వెంటనే జీతాలు ఇప్పించండి... కింగ్‌ఫిషర్ సంస్థ ఉద్యోగుల నిరసన!
కింగ్‌ఫిషర్ సంస్థ ఉద్యోగులు సంస్థ అధినేత విజయ్ మాల్యా నివాసం, కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. 2012 సంవత్సరం నుంచి చెల్లించాల్సిన జీతభత్యాలను వెంటనే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. కింగ్‌ఫిషర్ సంస్థల అధినేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ విషయంపై స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.