: కూలి పని కోసం వెళ్తే...దశ తిరిగింది!


అదృష్టలక్ష్మి ఎప్పుడు, ఎవరిని, ఎలా, వరిస్తుందో చెప్పడం కష్టం. అలాగే పొట్టకూటికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లిన వ్యక్తిని మూడురోజుల్లో అదృష్టలక్ష్మి వరించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లా లక్ష్మీపూర్ కు చెందిన మొఫిజుల్ రహానా షేక్ కూలి పనుల కోసం కేరళ రాష్ట్రానికి ఈ నెల 4న వలస వెళ్లాడు. అదే రోజు అక్కడ ఓ 50 రూపాయలు పెట్టి 'కారుణ్య' లాటరీ టికెట్ కొన్నాడు. తరువాతి రోజు నిర్వహించిన లాటరీలో అతను కొన్న టికెట్ కు కోటి రూపాయల బహుమతి లభించింది. దీంతో, తనతో పాటు ఉన్న కూలీలు ఆ లాటరీ టికెట్ ఎక్కడ లాగేసుకుంటారో అన్న భయంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తనకు తగిలిన లాటరీ గురించి వివరించి రక్షణ కల్పించాలని కోరాడు. దీంతో స్పందించిన పోలీసులు, అతనిని బ్యాంకుకు తీసుకెళ్లి, అకౌంట్ ఓపెన్ చేయించి, టికెట్ కూడా అక్కడే సమర్పించారు. దీంతో బ్యాంకు దానిని 'కారుణ్య' లాటరీ సంస్థకు అందజేయనుంది. దీంతో పన్నులు మినహాయించుకుని మిగిలిన మొత్తం అతని ఖాతాలో జమ అయిపోతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News