: కామినేని 'పంది' వ్యాఖ్యలకు ముసిముసిగా నవ్విన చంద్రబాబు!


అమరావతిలో జరిగిన భూముల క్రయవిక్రయాలపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. చర్చలో భాగంగా మాట్లాడిన మంత్రి కామినేని, పందిని ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం సభ్యుల్లో నవ్వులు పూయించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించి నినాదాలు చేశారు. "జగన్ విధానం ఎమ్మెల్యేలకు గౌరవం కాదు. నా వరకూ వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడికీ సొంత పేపర్ ఉండకూడదు. పేపర్ అంటే, దాన్ని చదివిన వాళ్లు నమ్మేలా ఉండాలి. సొంత పేపర్ పెట్టుకుని మనవాళ్లంతా పునీతులు అన్నట్టు రాసుకోకూడదు. మీరు ఒక్కటి తెలుసుకోండి... జగన్ మోహన్ రెడ్డి గారూ... దేశంలోని సీనియర్ రాజకీయ నాయకులంతా చంద్రబాబును గౌరవిస్తారు. మనం మన నాయకుడిని గౌరవించుకోలేక పోతే, అది దురదృష్టం. మీకూ ఓ పేరొచ్చింది. ఎందుకొచ్చింది... మీరు రాజశేఖరెడ్డి కొడుకుగా కాకుండా, ఆ కేసుల్లో జైలుకు వెళ్లినప్పుడు పేరొచ్చింది. పచ్చకామెర్ల వాళ్లకు దేశమంతా పచ్చగా కనిపిస్తుంది. పంది బురదలో ఉండి అందరిమీదా బురద చల్లాలని అనుకుంటుంది. అది కరెక్ట్ కాదు..." అంటుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. కామినేని వ్యాఖ్యలను విన్న చంద్రబాబు ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.

  • Loading...

More Telugu News