: ఢిల్లీలో వందేళ్ల భారతీయ సినిమా వేడుకలు
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో వేడుకలు జరుగుతున్నాయి. వీటిని ఢిల్లీలోని సిరిఫోర్డ్ ఆడిటోరియంలో నిన్న కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ ప్రారంభించారు. అలనాటి పలు చిత్ర రాజాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఆరు రోజుల పాటు జరగనున్న చలనచిత్ర వేడుకల్లో హిందీ దర్శకుడు రమేశ్ సిప్పీ, నటుడు నాగార్జున తోపాటు పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.