: కోర్టుకు హాజరు కాని రజనీకాంత్!
లింగా చిత్రంపై కొనసాగుతున్న విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ గైర్హాజరయ్యారు. చిత్ర కథ తనదేనంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసు మద్రాస్ హైకోర్టులో విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సహా చిత్ర నిర్మాతలు, దర్శకులు స్వయంగా కోర్టుకు రావాలని గతంలోనే సమన్లు జారీ అయ్యాయి. రజనీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వచ్చి, ఆయన రాలేకపోయిన కారణాలపై వివరణ ఇచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణను వాయిదా వేసింది.