: ఫడ్నవీస్ తో కేసీఆర్ భేటీ... మేడిగడ్డ సహా ఐదు ప్రాజెక్టులపై ఒప్పందాలు


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్రతో కీలక ఒప్పందాల కోసం నిన్న మధ్యాహ్నమే మంత్రులు, అధికారుల బృందంతో ముంబై వెళ్లిన కేసీఆర్, కొద్దిసేపటి క్రితం అక్కడి సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో ‘మహా’ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, సాగునీటి శాఖ అధికారుల సమక్షంలో ఇద్దరు సీఎంలు ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత కేసీఆర్, ఫడ్నవీస్ లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు సహా మరో నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాలను ఇద్దరు సీఎంలు చారిత్రాత్మక ఒప్పందాలుగా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News