: సమాధానం చెప్పే బాధ్యతను మంత్రులకు అప్పగించిన చంద్రబాబు
ఉభయసభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు అప్పగించారు. వివిధ శాఖలను గ్రూపులుగా విభజించి, వాటిని ఎంపిక చేసిన మంత్రులకు కేటాయించడంతో పాటు వాటిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను మంత్రులే స్వయంగా అసెంబ్లీ ముందుంచాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా న్యాయశాఖ, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలను యనమల రామకృష్ణుడికి అప్పగించారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బొగ్గు, పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను చెప్పే బాధ్యతను అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఇకపై ఈ శాఖలపై వచ్చే ప్రశ్నలకు అసెంబ్లీలో వీరే సమాధానాలు చెప్పనున్నారు.