: షమి కోలుకున్నా తీసుకోవడం కష్టమే: ధోనీ
టీట్వంటీ వరల్డ్ కప్ జట్టులో షమికి స్థానం కల్పించడం కష్టమని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీమిండియాలో యార్కర్లు అద్భుతంగా విసరగల షమి కోలుకున్నాడో లేదో తెలియదని ధోనీ చెప్పాడు. అయితే ప్రస్తుతానికి టీమిండియా కూర్పు అద్భుతంగా కుదిరిందని అన్నాడు. నెహ్రా, బుమ్రా చక్కగా రాణిస్తున్నారని ధోనీ చెప్పాడు. అనుభవంతో నెహ్రా పిచ్ ను బట్టి బంతులు సంధిస్తూ రాణిస్తున్నాడని అన్నాడు. కీలక సమయాల్లో బుమ్రా యార్కర్లతో ఆకట్టుకుంటున్నాడని ధోనీ చెప్పాడు. ఇక హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయగలగడంతో పాటు, బ్యాటింగ్ లో 8వ నెంబర్ లో జడేజాకు ప్రత్యామ్నాయంగా మారాడని అన్నాడు. ఈ మేళవింపును మార్చడం జట్టుకు ఇబ్బందిగా మారుతుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. జట్టు రాణిస్తున్నప్పుడు ఇలాగే కొనసాగించడం బావుంటుందని ధోనీ తెలిపాడు.