: కన్నయ్య కుమార్ ను చంపమన్న వ్యక్తి అరెస్ట్
జేఎన్యూ స్టూడెంట్ నాయకుడు కన్నయ్య కుమార్ ను చంపితే 11 లక్షల రూపాయల రివార్డు అందజేస్తానని ప్రకటించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కన్నయ్య కుమార్ ను చంపితే 11 లక్షల రూపాయల అందజేస్తానంటూ ఆనంద్ శర్మ ఢిల్లీలో గోడపత్రికలు అంటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అతనిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద కొన్ని వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అతను కనీసం ఇంటి అద్దెకూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడని, గత కొన్ని నెలలుగా అద్దె కట్టలేదని వారు వెల్లడించారు.