: ఆ డబ్బు ముట్టుకోవద్దు... విజయ్ మాల్యాకు ట్రైబ్యునల్ షాక్!


కింగ్ ఫిషర్ బ్రాండ్ తో భారతీయ వ్యాపారదిగ్గజంగా నీరాజనాలు అందుకున్న విజయ్ మాల్యా ఎయిర్ లైన్స్ రంగంలో ప్రవేశించి అంతకు మించిన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎడాపెడా కేసులతో ఉచ్చు బిగుస్తుండడంతో భారత్ లో ఇక లాభం లేదని భావించి, లండన్ లో స్థిరపడదామని నిర్ణయించుకున్న తరుణంలో ఆర్థికలావాదేవీల కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. ఐడీబీఐ ఇచ్చిన 900 కోట్ల రూపాయల రుణం ఎగవేత వ్యవహారంపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తాజాగా 'డెట్ రికవరీ ట్రైబ్యునల్'లో కేసు నమోదు చేసింది. కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆయనకు చెందిన బ్రువరీస్ కంపెనీ అమ్మిన డియాజియో నుంచి ఒక్క పైసా కూడా ఆయన తీసుకోకూడదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ సంస్థను అమ్మడం ద్వారా మాల్యాకు 515 కోట్ల రూపాయలు వాటాగా రానున్నాయి. ఇప్పుడీ ఆదేశాలతో మాల్యాకు షాక్ తగిలింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News