: కోటప్పకొండకు తరలిన ప్రభలు... డ్యాన్సులుండవుగానీ, పాట కచేరీలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు!


ఏపీలో అతిపెద్ద తిరునాళ్లగా పేరున్న కోటప్పకొండ త్రికోటేశ్వరుని శివరాత్రి తిరునాళ్లకు వివిధ గ్రామాల నుంచి విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి. మొత్తం 14 భారీ ప్రభలు, వందలాది చిన్న ప్రభలతో కోటప్పకొండ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఉదయం 10 గంటల సమయం నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్లలో కరెంటును నిలిపివేసి, ఆయా ప్రభలను ఆ మార్గం దాటించారు. దశాబ్దాలుగా కోటప్పకొండకు ప్రభలను తీసుకువస్తున్న కావూరు, అవిశాయపాలెం, పురుషోత్తమపట్నం తదితర గ్రామాల ప్రభలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, గతంలో ప్రభలపై ప్రదర్శించే రికార్డింగ్ డ్యాన్సుల కోసమే వేలాది మంది తిరునాళ్లకు వచ్చేవారు. ఆపై కొన్నేళ్ల క్రితం రికార్డింగ్ డ్యాన్సులపై నిషేధం విధించడంతో, ఆపై కోటప్పకొండకు వచ్చి రాత్రిపూట గడిపేవారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, కోటప్పకొండను అన్ని రకాలుగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన ప్రభుత్వం, మరింతమంది భక్తులను ఆకర్షించే దిశగా, గత సంవత్సరం ప్రభలపై పాట కచేరీలకు అనుమతించింది. ఈ సంవత్సరం పాట కచేరీలతో పాటు, పౌరాణిక నాటకాలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News