: తెలంగాణకు గుడ్ న్యూస్!... దేవాదులకు రూ.112 కోట్లు విడుదల చేసిన కేంద్రం


పొరుగు రాష్ట్రాలతో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన శుభ సమయంలో ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీపి కబురు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు దేవాదులకు తొలి విడత నిధులను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని కరవు ప్రాంతాలను సాగు భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు తొలి విడతగా రూ.112 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News