: వారి భార్యా బిడ్డలను చంపేద్దాం: ట్రంప్ నుంచి మరోసారి నోటి దురుసు మాటలు


అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని పెట్టారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. తాను అధ్యక్షుడినైతే ఉగ్రవాదుల పట్ల ప్రస్తుతమున్న చట్టాలను మరింతగా కఠినం చేస్తానని, వారిని విచారించే పద్ధతులను సమూలంగా మార్చేస్తానని అన్నారు. అనుమానిత ఉగ్రవాదుల భార్యా, బిడ్డలను చంపేసేలా చట్టాలను మారుస్తానని అన్నారు. వాటర్ బోర్డింగ్ (అత్యంత క్రూరమైన హింసా పద్ధతుల్లో ఒకటి. దీనిపై అమెరికాలో నిషేధం ఉంది) సహా ఇంకా కఠినమైన ఇంటరాగేషన్ పద్ధతులను తిరిగి అమల్లోకి తెస్తానని అన్నారు. "వారు ఆడుతున్నట్టుగానే మనమూ ఆడాలి. చట్టాలను మరింత బలంగా తయారు చేయాలి. మెతక వైఖరితో ఉంటే నష్టాలే అధికం. ఇలాగే ఉంటే ఐఎస్ఐఎస్ తో మానసికంగా పోటీ పడలేం" అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఓ వైపు దుమారం పెరుగుతున్నప్పటికీ, అమెరికన్లలో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News