: ముక్కంటి అంతరాలయంలోకి కనుమూరి దంపతులు... ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు చైర్మన్


మహా శివరాత్రిని పురస్కరించుకుని వేలాది సంఖ్యలో భక్తులు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటీశుడి ఆలయానికి పోటెత్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కూడా కుటుంబసమేతంగా ముక్కంటీశుడి దర్శనానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వద్ద కలకలం చోటుచేసుకుంది. అనుమతి లేకున్నా, కనుమూరి బాపిరాజు దంపతులు ఆలయంలోని అంతరాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. బోర్డు సభ్యుడు వెంకటరమణనాయుడు కనుమూరి దంపతులను దగ్గరుండి మరీ అంతరాలయంలోకి తీసుకెళ్లారట. విషయం తెలుసుకున్న ఆలయ బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకున్నా, కనుమూరి దంపతులను అంతరాలయంలోకి ఎందుకు తీసుకెళ్లారంటూ ఆయన వెంకటరమణనాయుడును నిలదీశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News