: కేబినెట్ భేటీకి సచివాలయం చేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ నెల 10 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలిసి సమావేశాల నిర్వహణపై మాట్లాడారు. అనంతరం ఆయన సచివాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ తో భేటీ నిర్వహించనున్నారు. దీంతో కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సచివాలయానికి చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై చర్చించనున్నారు.