: సుశీల్ ఆమెను వెంబడించినట్టు నిర్ధారించిన సీసీటీవీ పుటేజ్


ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ హైదరాబాదు, బంజారాహిల్స్ లో ముస్లిం మహిళను వెంబడించినట్టు నిర్ధారణ అయింది. రావెల సుశీల్ ఓ ముస్లిం మహిళను అడ్డగించి, చేయిపట్టి కారులోపలికి లాగే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రావెల సుశీల్ ఆమెను కారులో వెంబడించినట్టు నిర్ధారించే సీసీ టీవీ పుటేజ్ ను సంపాదించారు. దీనిని వివిధ టీవీ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఈ పుటేజ్ లో సుశీల్ ఆమెను వెంబడించినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆమె భయంతో నడుస్తున్నట్టు పుటేజ్ లో కనబడింది. దీంతో సుశీల్, కారు డ్రైవర్ రమేష్ పై బంజారాహిల్స్ పోలీసులు సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దీనిపై నేటి ఉదయం సుశీల్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. తాను ఆమెను వేధించలేదని, కుక్కను రక్షించేందుకు ప్రయత్నిస్తే ఆమె వేధించినట్టు చెబుతోందని, తనపై వారు దాడి చేశారని అందులో ఆయన పేర్కొన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పరారీలో ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News