: హాలీవుడ్ నటిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం


పలు దేశాల్లో సేవలు అందిస్తున్న ఉబెర్ క్యాబ్స్ తన డ్రైవర్ల కారణంగా అప్రదిష్ఠమూటగట్టుకుంటోంది. తాజాగా అమెరికాలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ హాలీవుడ్ నటిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 'టీన్ మామ్' సీరియల్ ద్వారా ప్రతిష్ఠ సంపాదించుకున్న ఫర్హా అబ్రహం న్యూయార్క్ లోని లాంగ్ ఐలండ్ నుంచి తన నివాసానికి వచ్చేందుకు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఉబెర్ క్యాబ్ ఎక్కారు. మార్గమధ్యంలో ఉబెర్ డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడి, అత్యాచారయత్నం చేశాడు. సమయానికి తన స్నేహితుడు వచ్చి కారు అద్దాలు పగులగొట్టి ఉండకపోతే ఘోరం జరిగిపోయేదని ఆమె పేర్కొన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి ముందు కూడా ఉబెర్ డ్రైవర్ అభ్యంతరకరంగా వ్యవహరించాడని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News