: కృష్ణా జిల్లా సూరారంలో పులి... పరుగులు తీసిన జనం
అడవిలో ఉండాల్సిన పులి జనావాసాల్లోకి వచ్చేసింది. పులిని చూసిన జనం పరుగులు పెట్టారు. ఇదీ కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం సూరారంలో చోటుచేసుకున్న ఘటన. నిన్న రాత్రి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ పులి నేరుగా గ్రామంలోకి వచ్చేసింది. ఉన్నట్టుండి సడన్ గా గ్రామంలోని వీధుల్లో పులి కనిపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతబట్టుకుని పరుగులు పెట్టారు. ఆ తర్వాత గ్రామస్థుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే ఆ పులి గ్రామం విడిచి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది.