: రాష్ట్రం బాగుపడుతుంటే ప్రతిపక్షనేతలు ఓర్వలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు


రాష్ట్రం బాగుపడుతుంటే ప్రతిపక్షనేతలు చూసి, ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష నేతలు అడుగడుగునా అడ్డం పడుతున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పత్రికల్లో పిచ్చి రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని కోరారు. రాజధాని కోసం భూ సమీకరణలో భాగంగా 33 వేల ఎకరాలను రైతులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News