: ఆసుపత్రిపాలు చేసిన అధరచుంబనం!


వ్యసనాల బారిన పడడం, వాటిని నిర్లజ్జగా వెల్లడించడం నేటి యువతరానికి ఫ్యాషన్ అయిపోయింది. అదే విదేశాల్లో అయితే మాదకద్రవ్యాల బారిన పడి విచ్చలవిడిగా ప్రవర్తించడం సర్వసాధారణంగా మారింది. అమెరికాలోని కనెక్టికిట్ రాష్ట్రంలోని హార్డ్ ఫోర్డ్ సిటీలో షకియా లాంగ్ (37) డ్వేన్ విలియమ్స్ (41) తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరూ మాదకద్రవ్యాలు తీసుకున్నారు. దీంతో ఓ గాఢచుంబనంలో మునిగితేలారు. ఇక అప్పుడు మాదకద్రవ్యాలు తమ పని ప్రారంభించడంతో షకియాకు మత్తు ఎక్కువైపోయింది. ఏం చేస్తోందో కూడా ఆమెకు తెలియలేదు. ఆ మత్తులో ప్రియుడు విలియమ్స్ నాలుకను కొరికేసింది. దీంతో లబోదిబో మంటూ ప్రియుడు ఆమెనుంచి విడిపించుకుని పరుగెత్తి అటుగా వెళ్తున్న పోలీసుల సాయంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతి కష్టం మీద అతని నాలుకను అతికారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను విచారించారు. అయితే, ఆ సమయంలో అసలు విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలిదని ఆమె చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News