: జనాభా ఆధారంగా ఉల్లి నిల్వలు... టీ-సర్కార్ నిబంధనలు
జనాభా ఆధారంగా ఉల్లిపాయల నిల్వలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉల్లి డీలర్ల లైసెన్సులు, నిల్వ, నియంత్రణపై ఈ నోటిషికేషన్ లో పేర్కొంది. వాటి వివరాలు... పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ఒక్కొక్క వ్యాపారి 75 క్వింటాళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, గ్రామాల్లో 30 క్వింటాళ్ల వరకు ఉల్లి నిల్వలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి ఉల్లి వ్యాపారికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, రైతుల నుంచి ఉల్లిపాయలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కొనరాదని, వినియోగదారులకు అధిక ధరలకు అమ్మకూడదన్న నిబంధనలు విధించింది. ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న పక్షంలో రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండేలా చూస్తామని ఆ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది.