: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలాయె!
తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేస్తుందన్న ప్రకటన వెలువడింది. షెడ్యూల్ ప్రకటనతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి రానుంది. ఎలక్షన్స్ డాట్ ఇన్ వెబ్ సైట్లో పొందు పరిచిన సమాచారం ప్రకారం, జూన్ 2తో పాండిచ్చేరి, మే 6తో అసోం, మే 22తో తమిళనాడు, మే 29తో పశ్చిమ బెంగాల్, మే 31తో కేరళ అసెంబ్లీల పదవీ కాలం పూర్తి కానుంది. ఆయా తేదీలకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ వెల్లడికానుంది.