: సుజనా చౌదరికి సుప్రీంకోర్టులో చుక్కెదురు


టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి సుజనా చౌదరికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. మారిషస్ రుణాల బకాయి చెల్లింపు విషయంలో కింది కోర్టు విధించిన ఆరు నెలల గడువును పెంచాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఆయన సంస్థలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గడువు పెంపునకు నిరాకరించిన హైకోర్టు సుజనాకు షాకిస్తూ ఆరు నెలల గడువును మరో నెల తగ్గిస్తూ, ఐదు నెలల గడువునే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుజనా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గడువు పెంచాలన్న తన అభ్యర్థనను మన్నించకపోగా, గడువును కుదించడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు తీర్పు కరెక్టేనని పరోక్షంగా చెప్పిన సుప్రీం ధర్మాసనం సుజనా పిటిషన్ ను కొట్టేసింది.

  • Loading...

More Telugu News