: చంద్రబాబు గారూ..మాకిచ్చే డబ్బులు, మీ అబ్బాయి చెప్పుల ఖరీదు చేయవు: ముద్రగడ
కాపు కులస్తులకు ఇస్తున్న నలభై వేల రూపాయలతో ఏ వ్యాపారం చేయాలో చంద్రబాబు చెప్పాలని... తమ కులస్తులకు ఇస్తున్నఆ డబ్బులు, బాబు కొడుకు చెప్పుల ఖరీదు కూడా చేయవని కాపునేత ముద్రగడ వ్యాఖ్యానించారు. దరిద్రంలో ఉన్నాము.. దాని నుంచి బయటపడేయండి... కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే చంద్రబాబు ఇచ్చే మర్యాద ఇదేనా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ లోన్ ఇస్తూ తమ జాతిని అవమానిస్తున్నారని, కనీసం పదిలక్షల రూపాయలు ఇచ్చినా కూడా దరిద్రం నుంచి బయటపడలేని పరిస్థితుల్లో కాపు కులస్తులు ఉన్నారని ముద్రగడ అన్నారు.