: బాడీగార్డ్స్ ను డబ్బులు అడుక్కున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మనసున్న మనిషన్న సంగతి మనకు తెలుసు. ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి సల్మాన్ ఖాన్ తన వితరణను మరోసారి చాటుకున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడిపిన సల్లూభాయ్ తెల్లవారు జామున బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ సల్మాన్ ను చూసిన వీధి బాలలు పరిగెత్తుకుంటూ వచ్చి అతని చుట్టూ చేరారు. అంతే... తను కూడా వారితో సరదాగా కలిసిపోయి కబుర్లాడాడు. వాళ్లతో కలసి సెల్ఫీలు దిగాడు. తర్వాత ఆ పిల్లలను ఒట్టిచేతులతో పంపించడం ఇష్టం లేని సల్మాన్ వారికి కొంత మొత్తం ఇచ్చి పంపుదామని పర్సు తీశాడు. అందులో క్రెడిట్, డెబిట్ కార్డులు మాత్రమే కనిపించాయి. దీంతో, సల్మాన్ ఏమాత్రం భేషజం ప్రదర్శించకుండా తన బాడీ గార్డులను పిలిచి, డబ్బులు అడిగి ఆ పిల్లలకి ఇచ్చి పంపాడు.