: అధిష్ఠానం అవకాశమిస్తే పోటీ చేస్తా: నటి కుష్బూ


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆ పార్టీ ప్రచార ప్రతినిధి, సినీ నటి కుష్బూ పేర్కొన్నారు. చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయాలని కోరుతూ పార్టీకి చెందిన పలువురు నాయకులు తన తరపున దరఖాస్తులు చేశారని చెప్పారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె తన మనసులో మాటను బయటపెట్టారు. డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ను కాంగ్రెస్ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు విషయమై ఆయన ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని.. తమ పార్టీలో విజయ్ కాంత్ చేరాలనే తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. కార్తీ చిదంబరంపైన, కాంగ్రెస్ పైన బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలను ఆమె ఖండించారు.

  • Loading...

More Telugu News