: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బ్రేక్


హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు, అపార్ట్ మెంట్ల కూల్చివేత తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ రోజు భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలెట్టిన పంచాయతీ అధికారులకు స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. అనుమతులను కళ్లు మూసుకుని ఇచ్చారా? ఇప్పుడు వాటినెలా కూలుస్తారు? అంటూ స్థానికులు ఎదురు తిరిగారు. ఉద్రిక్తల నడుమ కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే అక్రమ నిర్మాణాలను కచ్చితంగా కూల్చి వేస్తామని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News