: తారల క్రికెట్టులో అదరగొట్టిన తెలుగు హీరోలు


సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో భాగంగా ఆదివారం పశ్చిమ బెంగాల్ సిలిగురిలో బెంగాల్ టైగర్స్ పై తొమ్మిది వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. ఆదిత్య హఫ్ సెంచరీతో తెలుగు వారియర్స్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బెంగాల్ టైగర్స్ 68 పరుగులకే ఆలౌటయింది. 

తెలుగు హీరోల బౌలింగ్ ధాటికి ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ రెండంకెల పరుగులు కూడా చేయలేకపోయారు. చరణ్ తేజ, రఘు రెండేసి వికెట్లు, గిరి, నందకిషోర్, ఆదర్శ్ ఒకొక్క వికెట్ పడగొట్టారు. మరో మూడు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి. 29 పరుగులు చేసిన జిషు ఇన్నింగ్స్ లో టాప్ స్కోరరుగా నిలిచాడు. 

  • Loading...

More Telugu News