: తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీషు నేర్చుకున్న ఆస్కార్ విజేత!
‘రూమ్’ చిత్రంలో నటనకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న బ్రి లార్సన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీషు నేర్చుకుందట. అదేమిటి...హాలీవుడ్ నటికి ఇంగ్లీషు రాకపోవడమేమిటనే అనుమానం ఎవరికైనా రాకమానదు. అయితే, లార్సన్ ఫ్రెంచ్ జాతీయురాలు. ఆమె అసలు పేరు బ్రియాన్నే సిడోనీ డిసౌల్ నీర్స్. ఆ పేరు ఆమె నాయనమ్మది. గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో తన పేరును బ్రి లార్సన్ గా మార్చుకుంది. లార్సన్ కేవలం నటి మాత్రమే కాదు. పాప్ స్టార్ కూడా. 2005లో ఒక ఆల్బమ్ కూడా విడుదల చేసింది. ఆ ఆల్బమే ఆమెకు మొదటిది, చివరిది. ఇక అసలు విషయానికొస్తే... ఆమె తొలి సినిమాలో నటించే సమయంలో లార్సన్ కు తన మాతృభాష ఫ్రెంచ్ తప్ప ఇంగ్లీషు రాదట. కనీసం అర్థం చేసుకునేంత ఆంగ్ల పరిజ్ఞానం కూడా ఆమెకు లేదు. ఆ తర్వాత, తప్పనిసరి పరిస్థితుల్లో లార్సన్ ఇంగ్లీషు నేర్చుకోక తప్పలేదని హాలీవుడ్ వర్గాల సమాచారం.