: కన్నయ్య కుమార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు


జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ కు ఢిల్లీ న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దేశద్రోహం కేసులో కన్నయ్య కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, కన్నయ్య కుమార్ దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు వీడియో సాక్ష్యం లేదని ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జేఎన్ యూ ప్రొఫెసర్లు పూచీకత్తుగా ఉండాలని సూచించింది. దీంతో రేపు ఉదయం కన్నయ్య కుమార్ జైలు నుంచి విడుదల కానున్నాడు.

  • Loading...

More Telugu News