: ప్రపంచ రికార్డుకు ప్రయత్నిస్తున్న సోనాక్షి సిన్హా


ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. బాలీవుడ్ నటి కావడంతో సోనాక్షికి విశేషమైన ఆదరణ ఉంది. దీనిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోవాలని భావించిన సోనాక్షి సిన్హా ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా ప్రణాళికలు వేసుకుంది. మార్చి 8న వుమెన్స్ డేను పురస్కరించుకుని ముంబైలో భారీ ఎత్తున మహిళలను ఒక చోటకి చేర్చి గోళ్ల రంగు వేసుకునే కార్యక్రమానికి నాంది పలికింది. అలా మహిళలు భారీ సంఖ్యలో ఒక చోట చేరి గోళ్లకు రంగు వేసుకుంటే 'మోస్ట్ పీపుల్ పెయింటింగ్ దెయిర్ ఫింగర్ నెయిల్స్ సైమల్ టేనియస్లీ' రికార్డు దక్కనుంది. ఇందులో పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సోనాక్షి తెలిపింది. ఈ కార్యక్రమాన్ని పోలేండ్ కు చెందిన ప్రఖ్యాత కాస్మోటిక్ బ్రాండ్ ఇంగ్లోట్, మేజర్ బ్రాండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News